
ముంబై : కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ కోలుకున్న 68 ఏళ్ల వృద్ధుడు ముంబై ఆస్పత్రిలో సోమవారం మరణించారు. బాధితుడు ఫిలిప్పీన్స్‌కు చెందిన వ్యక్తని అధికారులు తెలిపారు. తొలుత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్ధానిక కస్బూర్బా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం నెగెటివ్ రిపోర్ట్ రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఆయన ఆస్పత్రిలో మరణించారని అధికారులు వెల్లడించారు. మధుమేహం, ఆస్త్మా, శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కాగా ఫిలిప్పీన్స్ వ్యక్తి కోవిడ్-19తో మరణించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment