
వీడియో దృశ్యాలు
క్వారంటైన్ సెంటర్లలో రోజులకు రోజులు నాలుగు గోడల మధ్య ఖాళీగా ఉండటం అంటే మామూలు విషయం కాదు! అందుకే ఊసుపోదు.. ఉండనీదు.. వెళ్లనీదు.. అంటూ తెగ ఫీలైపోతున్నారు కరోనా పేషంట్లు. కానీ, క్వారంటైన్ సెంటర్లలో వెసలు బాట్లను బట్టి కొంతమంది తమకు తోచినట్లుగా టైం పాస్ చేయటం.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టటం పరిపాటిగా మారింది. తాజాగా క్వారంటైన్ టైంపాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో రోగులు చక్కగా క్రికెట్ ఆడుతున్న వీడియో అది. ( వైరల్: ఈ కొండముచ్చు చాలా డిఫరెంట్)
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘స్థలం ఉంది.. ఆడుకోనీ.. క్వారంటైన్ టైం పాస్’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో గంటల వ్యవధిలోనే కొన్ని వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘కేసులు పెరగటంలో ఆశ్చర్యమేమీ లేదు.. గడ్డు సమయంలో కూడా మన భారతీయులు వినోదం కోసం ఏదో ఒకదాన్ని అన్వేషిస్తూనే ఉంటారు.. క్వారంటైన్ అన్న పదానికి అర్థాన్నే మార్చేశారు.. క్వారంటైన్ సెంటరా? క్రికెట్ స్టేడియమా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?)
Comments
Please login to add a commentAdd a comment