మే 6న ‘హేలీ’ ఉల్కాపాతం! | On May 6, 'Haley' meteor! | Sakshi
Sakshi News home page

మే 6న ‘హేలీ’ ఉల్కాపాతం!

Published Sun, Apr 27 2014 12:39 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

మే 6న ‘హేలీ’ ఉల్కాపాతం! - Sakshi

మే 6న ‘హేలీ’ ఉల్కాపాతం!

వచ్చే నెల 6వ తేదీన రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన ‘హేలీ’ ఉల్కాపాతం కనువిందు చేయనుంది. భారత్ సహా ఉష్ణమండల ప్రాంతం, దక్షిణార్ధగోళంలో ఈ ఉల్కాపాతం బాగా కనిపించనుంది. హేలీ తోకచుక్క నుంచి కొన్ని వందల ఏళ్ల క్రితం వేరుపడిన భాగాలకు చెందిన చిన్నచిన్న ముక్కలే ఈ ఉల్కాపాతంగా కనువిందు చేయనున్నాయి.

అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే ఉల్కాశకలాలు మండిపోవటాన్నే ఉల్కాపాతంగా పిలుస్తారన్నది తెలిసిందే. ‘ఈటా ఆక్వార్డిస్’ అని పిలిచే ఈ ఉల్కాపాతం ఏటా ఏప్రిల్ 19 - మే 28 మధ్యలో సంభవిస్తుంది. మే 6న ఉచ్ఛస్థితిలో కనిపిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇది ఈ ఏడాది మరింత బాగా కనువిందు చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement