Haley
-
ఇవి తగినంత ఉంటే కరోనాకు చెక్
సాక్షి.హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్–19’అధ్యయనంలో వెల్లడైంది. ఇదీ అధ్యయనం: గాలి ద్వారా ‘ఏరోసోల్స్’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్ మోడల్ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు జనసమూహాలు ఉండే ప్రదే శాల్లోనూ కోవిడ్ మహమ్మారి నియంత్రణకు ఉపయోగపడతాయని వారు పేర్కొంటున్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు -
‘ఐరాస హక్కుల’ నుంచి అమెరికా ఔట్
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి: అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనిచేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్–హెచ్ఆర్సీ) ఇజ్రాయెల్‌పై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో కలసి వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అత్యంత అమానవీయమైన దేశాలు తనిఖీల్ని తప్పించుకుంటున్నాయి. కానీ యూఎన్ హెచ్ఆర్సీ మాత్రం వారిని వదిలేసి మానవహక్కుల పరిరక్షణలో మంచి రికార్డు ఉన్న దేశాల్ని(ఇజ్రాయెల్) లక్ష్యంగా చేసుకుంటోంది. మండలి ఇజ్రాయెల్‌పై ఎడతెగని శత్రుత్వాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మానవహక్కుల ఉల్లంఘనలు, దురాగతాలకు పాల్పడే దేశాలే మండలిలో సభ్యులుగా ఉన్నాయి’ అని నిక్కీ హేలీ విమర్శించారు. యూఎన్ హెచ్ఆర్సీ ప్రస్తుతం రాజకీయ పక్షపాతంలో కూడిన మురికిగుంటగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. మానవహక్కుల్ని ఉల్లంఘించి, దుర్మార్గాలకు పాల్పడిన దేశాలే యూఎన్ హెచ్ఆర్సీకి ఎన్నికవుతున్నాయని హేలీ ఎద్దేవా చేశారు. మండలి నుంచి వైదొలిగినప్పటికీ అమెరికా మానవహక్కులకు కట్టుబడి ఉంటుందన్నారు. తాజాగా మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం అన్యాయమని యూఎన్–హెచ్ఆర్సీ విమర్శించింది. దీంతో ట్రంప్ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా గతేడాది ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నుంచి కూడా బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన యూఎన్ హెచ్ఆర్సీలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి. -
మే 6న ‘హేలీ’ ఉల్కాపాతం!
వచ్చే నెల 6వ తేదీన రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన ‘హేలీ’ ఉల్కాపాతం కనువిందు చేయనుంది. భారత్ సహా ఉష్ణమండల ప్రాంతం, దక్షిణార్ధగోళంలో ఈ ఉల్కాపాతం బాగా కనిపించనుంది. హేలీ తోకచుక్క నుంచి కొన్ని వందల ఏళ్ల క్రితం వేరుపడిన భాగాలకు చెందిన చిన్నచిన్న ముక్కలే ఈ ఉల్కాపాతంగా కనువిందు చేయనున్నాయి. అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే ఉల్కాశకలాలు మండిపోవటాన్నే ఉల్కాపాతంగా పిలుస్తారన్నది తెలిసిందే. ‘ఈటా ఆక్వార్డిస్’ అని పిలిచే ఈ ఉల్కాపాతం ఏటా ఏప్రిల్ 19 - మే 28 మధ్యలో సంభవిస్తుంది. మే 6న ఉచ్ఛస్థితిలో కనిపిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇది ఈ ఏడాది మరింత బాగా కనువిందు చేయనుంది.