ట్రైనర్ వేధింపులు..,క్రీడాకారిణి ఆత్మహత్య | One Girl Dies, 3 Critical After Taking Poison at Sports Institute in Kerala | Sakshi
Sakshi News home page

ట్రైనర్ వేధింపులు..,క్రీడాకారిణి ఆత్మహత్య

Published Thu, May 7 2015 11:52 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

ట్రైనర్ వేధింపులు..,క్రీడాకారిణి  ఆత్మహత్య - Sakshi

ట్రైనర్ వేధింపులు..,క్రీడాకారిణి ఆత్మహత్య

కేరళ: కేరళలోని ఒక క్రీడా శిక్షణా సంస్థలో వేధింపులు తట్టుకోలేక నలుగురు క్రీడాకారిణిలు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో15  ఏళ్ళ క్రీడాకారిణి అపర్ణ మృతి చెందింది.   అలప్పుఝా జిల్లాలోని శిక్షణా కేంద్రంలో వేధింపులను భరించలేక,  నలుగురు క్రీడాకారిణులు విష ఫలాలు సేవించి  ఆత్మహత్యకు  యత్నించారు. బుధవారం సాయంత్రం అపస్మారక స్థితిలో హాస్టల్ లో ఉన్న ...వీరిని వార్డెన్ గుర్తించి హెల్పర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు.
 
 వీరంతా రోవర్స్గా శిక్షణ పొందుతున్నట్టు సమాచారం.  ట్రైనర్ తీవ్రమైన వేధింపులకు తట్టుకోలేకే తమ పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. అయితే అధికారులు మాత్రం వేధింపుల ఆరోపణలను ఖండిస్తున్నారు. అయితే బీర్ తాగిన క్రీడాకారిణిలను మందలించటంతో వారు ఈ సంఘటనకు పాల్పడినట్లు శిక్షణా సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement