పోలీసులపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి | One policeman was killed and two others were injured in the terror attack | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ పర్యటన, ఉగ్రవాదుల దాడి

Published Sat, Sep 9 2017 6:58 PM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

పోలీసులపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి - Sakshi

పోలీసులపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి

సాక్షి, శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఓ వైపు కేంద్ర హోంమంత్రి పర్యటిస్తుంటే మరోవైపు అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  శనివారం బస్టాండ్‌లో వేచి ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. షోపియాన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

కాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి కలకలం రేపుతోంది.  రాజ్‌నాథ్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీనగర్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గురా, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులూ కూడా పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్‌ ఇవాళ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీతో భేటీ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement