సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: మూడుసార్లు ‘తలాక్’ చెప్పి ముస్లిం మహిళలకు విడాకులిచ్చే ఆచారాన్ని వ్యతిరే కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల హక్కులకు భంగ ం వాటిల్లే ఈ ఆచారానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయి. ఈ నెలాఖరుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ అంశంపై సుప్రీంకోర్టులో నివేదిక అందజేయనున్నారు.
మూడు సార్లు తలాక్ చెప్పడమనే ఆచారం ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా లేదని, మనకే ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ కిందటి వారం సమావేశమై మూడు సార్లు తలాక్ చెప్పడం తదితర ముస్లిం పద్ధతులు.. సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిన సమాధానంపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
‘తలాక్’కు వ్యతిరేకం
Published Sun, Sep 18 2016 11:55 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement