
'మా కార్యాలయానికి కోతుల బెడద'
పనాజి: రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై కోతులు దాడి చేస్తున్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఆదివారమిక్కడ జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యాలయం ముందు ఉన్న భద్రతా సిబ్బంది పని కోతులను లోపలికి రాకుండా చూడటమేనని చెప్పారు. అయితే అవి నిజమైన రామసేన కోతులని, కర్ణాటకకు చెందిన రామసేన కోతులు కాదని మంత్రి హాస్యమాడారు. పారికర్ గోవా సీఎంగా ఉన్నప్పుడు హిందూ మతసంస్థ రామసేనపై నిషేధం విధించారు.