సుప్రీంలో 300 లైంగిక వేధింపుల కేసులు పెండింగ్ | Over 300 cases of sexual harassment against women pending before Supreme Court | Sakshi

సుప్రీంలో 300 లైంగిక వేధింపుల కేసులు పెండింగ్

Oct 13 2013 2:06 PM | Updated on Sep 2 2018 5:20 PM

మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి నమోదైన 300కు పైగా కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.

 మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి నమోదైన 300కు పైగా కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. పుణెకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

సుప్రీం కోర్టు అందించిన సమాచారం మేరకు మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు పాల్పడం వంటి సంఘటనలకు సంబంధించి మొత్తం 325 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక కిడ్నాప్ తదితర కేసులు 403 దాకా పెండింగ్లో ఉన్నట్టు పేర్కొంది. అవినీతి, విడాకులకు సంబంధించి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కాగా అన్నింటికంటే అధికంగా భూవివాదాలకు సంబంధించి 8,490 కేసులు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement