
వరుడి ముందు వధువు డ్యాన్స్ అదుర్స్
న్యూఢిల్లీ: ఈ మధ్య వివాహాల ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల వరకు తమ తాహతకు తగినట్లుగా హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లిల్లో సంగీత్‌లపై దృష్టి బాగా ఎక్కువవుతోంది. బరత్ నుంచి భారీ సంగీత్‌లపై తమ దృష్టిసారిస్తున్నారు. సంగీత్‌వంటి కార్యక్రమాల్లో సాధారణంగా పెళ్లి చేసుకుంటున్న వధువు, వరుడు కుటుంబ సభ్యులు ఆడిపాడుతుంటారు.
పెళ్లి కూతురు, కుమారుడు కూడా ఈ పనిచేస్తారు. కానీ, పెళ్లి కుమారుడుని కూర్చొబెట్టి అతడి ముందు వధువు ఎలాంటి భయం, బిడియం లేకుండా డ్యాన్స్ చేయడం చాలా అరుదు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ, నిజంగానే ఓ పెళ్లి వేడుకలో తన కాబోయే భర్తను కూర్చొబెట్టి అద్భుతంగా వధువు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. గత జనవరిలో యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ వీడియోను ఇప్పటి వరకు 60లక్షలసార్లు వీక్షించారు.
రికార్డు స్థాయిలో వధువు దాదాపు 17 నిమిషాలపాటు డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ఆమె మాత్రమే కాకుండా తన స్నేహితురాళ్లు అనంతరం ఎమోషన్స్‌తో తన తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని, ఆఖరికి నడవలేని తన నాయనమ్మ, చిన్న పిల్లలు ఇలా ప్రతి ఒక్కరు చక్కటి డ్యాన్స్ చేసి వరుడిని సంతోష పెట్టడమే కాకుండా సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఈ వీడియో చూసిన వాళ్లు వావ్ అని అనుకోవడమే కాకుండా ఎంతో ఎమోషనల్ అవుతారు.