సాక్షి, హైదరాబాద్ : భారత్, చైనా సైనికాధికారుల స్ధాయి చర్చల సారాంశాన్ని వెల్లడించాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మన సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు..చైనా ప్రతినిధులతో ఏం మాట్లాడారో కేంద్ర ప్రభుత్వం దేశానికి వివరించాల’ని అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం దాల్చుతోందని నిలదీశారు. లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని ఓవైసీ ప్రశ్నించారు.
ఇండో - చైనా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వ్యవహారంలో ప్రతిష్టంభనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మరోవైపు భారత్, చైనాలు సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని విదేశాంగ శాఖ వెల్లడించగా, సరిహద్దుల్లో చైనా ఆర్మీ పెద్ద ఎత్తున సేనలను మోహరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా భారత్-చైనా సైనికాధికారుల భేటీ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment