‘పాక్ ఇంకా తన సమాధానం చెప్పలేదు’
న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇంకా పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. జాదవ్‌కు ఉరిశిక్షకు సంబంధించిన చార్జీషీట్ కాపీని తాము అడిగామని, అయితే, ఈ విషయంలో పాక్ విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించారు.
జాదవ్ ఉరి శిక్ష విషయంలో పైకోర్టుకు వెళతామని భారత్ ఇప్పటికే ప్రకంటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భారత్ హైకమిషనర్ గౌతమ్ బాంబవాలే పాక్ విదేశాంగ కార్యదర్శి తెమినా జాంజువాను శుక్రవారం కలిసి చార్జిషీట్ కాపీని అడిగారు. రెండు కాపీలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు పాక్ స్పందించలేదు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించాడని పాక్ భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి జాదవ్‌కు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.