పాక్ దర్గాలో ఆత్మాహుతి దాడి | Pakistan: Suicide bomber kills 55 at Shah Noorani Dargah | Sakshi
Sakshi News home page

పాక్ దర్గాలో ఆత్మాహుతి దాడి

Published Sun, Nov 13 2016 2:28 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

పాక్ దర్గాలో ఆత్మాహుతి దాడి - Sakshi

పాక్ దర్గాలో ఆత్మాహుతి దాడి

43 మంది మృతి, 100 మందికి గాయాలు
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శనివారం ఓ ప్రసిద్ధ సూఫీ దర్గాలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 43 మంది మృతిచెందారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 14 ఏళ్ల బాలుడు ఈ దాడికి పాల్పడ్డాడు. బలూచిస్తాన్ రాష్ట్రంలోని లాస్బెలా జిల్లాలో మారుమూల ఉండే దర్గా షా నూరానీ ప్రార్థనా మందిరంలో సూఫీ భక్తులు ‘ధమాల్’ నృత్యం చేస్తున్నప్పుడు ఈ దారుణం చోటుచేసుకుంది. దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. కరాచీ, ఇతర ప్రాంతాలను నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దర్గాకు వస్తున్నా సరైన వైద్య సదుపాయాలు ఉండవనీ, కనీసం భద్రత కూడా సరిగా లేదని స్థానిక అధికారులు చెప్పారు. పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఈ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదాన్ని తమ దేశంలో నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement