సాక్షి, న్యూఢిల్లీ : తనకు సాయం చేయాలన్న ఓ పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఆమె కోరినట్లుగా వీసా మంజూరు చేస్తామని సుష్మా ట్వీట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిదా షోయబ్ అనే పాకిస్తాన్ మహిళకు ఏడేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయి. తమ చిన్నారికి భారత్‌లో ట్రీట్‌మెంట్ ఇప్పించాలని పాక్ మహిళ నిదా షోయబ్ అనుకున్నారు.
ఆ మేరకు భారత్ వచ్చేందుకు వీసా కోసం ఆమె గత ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పిటికీ తమ వీసా మంజూరు కాలేదని, ప్రాసెస్‌లోనే ఉందని కేంద్ర మంత్రి సుష్మాకు ట్వీట్‌లో తెలిపారు. ఆ విషయంపై స్పందించిన సుష్మాస్వరాజ్.. పాక్ మహిళకు అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. 'మీ ఏడేళ్ల పాపకు ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించవచ్చు. మీకు వీసా మంజూరు చేస్తాం. మీ పాప త్వరగా కోలుకోవాలని మేం కూడా ప్రార్థిస్తామంటూ' ఆమె రీట్వీట్ చేశారు.
Yes, we are allowing Visa for your 7 years old daughter's open heart surgery in India. We also pray for her early recovery. https://t.co/bFmUXriQCC
— Sushma Swaraj (@SushmaSwaraj) 27 September 2017
respected @SushmaSwaraj mam my daughter need open heart surgery i aplied in aug stil the visa is in process pls help us i m very thankful u
— nida shoaib (@nidashoaib1) 25 September 2017