వెబ్సైట్‍ను హ్యాక్ చేసి చెత్త రాతలు.. | Pakistani hackers attack Noida management institute's website | Sakshi

వెబ్సైట్‍ను హ్యాక్ చేసి చెత్త రాతలు..

Published Thu, Jul 7 2016 9:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

వెబ్సైట్‍ను హ్యాక్ చేసి చెత్త రాతలు..

వెబ్సైట్‍ను హ్యాక్ చేసి చెత్త రాతలు..

నోయిడా: నోయిడాలోని ప్రముఖ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్కు సంబంధించిన వెబ్సైట్ హ్యాకర్ల బారినపడింది. వెబ్సైట్ను ఓపెన్ చేస్తే.. దానిలో పాకిస్తాన్ జెండా దర్శనమివ్వడంతో అధికారులు షాక్ తిన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. సైట్ను అఫ్లైన్లో ఉంచారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కు చెందిన ది స్కూల్ ఆఫ్ లా, డిజైన్ అండ్ ఇన్నొవేషన్ అకాడమీ వెబ్సైట్ సోమవారం రాత్రి హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. వెబ్సైట్లో హ్యాకర్లు పాకిస్తాన్ జెండాతో పాటు చైనా జెండాను ఉంచి.. భారత్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 'మాస్టర్ జీ వెబ్సైట్ పాకిస్తానీ హ్యకర్లచే హ్యాక్ చేయబడింది' అంటూ వెబ్సైట్లో ఓ మెసేజ్‍ను సైతం ఉంచారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లు సర్కిల్ ఆఫీసర్ అరవింద్ యాదవ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement