17 నుంచి పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 17న ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక అదే రోజున జరగనున్న సంగతి తెలిసిందే. జూలై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జూలై చివరి వారంలో ప్రారంభం కావాల్సిన సమావేశాలను, రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.