ముఫ్తీ వ్యాఖ్యలపై పార్లమెంటులో రగడ | parliament uproar by congress on mufti coments | Sakshi
Sakshi News home page

ముఫ్తీ వ్యాఖ్యలపై పార్లమెంటులో రగడ

Published Mon, Mar 2 2015 12:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ముఫ్తీ వ్యాఖ్యలపై పార్లమెంటులో రగడ - Sakshi

ముఫ్తీ వ్యాఖ్యలపై పార్లమెంటులో రగడ

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో ధుమారం రేగింది. సోమవారం జరుగుతున్న ప్రశ్నోత్తరాలను కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని అడ్డుకుంది. ఉగ్రవాదులు సహకరించడం వల్లే జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సమాధానం చెప్పాలని పట్టుబట్టింది. ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పింది. అవి దేశం మొత్తానికి వర్తించే వివాదాస్పద వ్యాఖ్యలని, మనోభావాలను దెబ్బతీసేవని పేర్కొంది.

 

                            బీజేపీ అగ్రనేతల మధ్య సీఎంగా ప్రమాణం చేసిన ముఫ్తీ అనంతరం మీడియా సమావేశంలో  ముఖ్యమైన ప్రాంతానికి సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు మందలించలేదని లేదని కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీసింది. పాకిస్థాన్ను పరోక్షంగా పొగడటమేనని వ్యాఖ్యానించింది. మనందరిని విమర్శించడమేనని చెప్పింది. ఇందుకు రాజ్నాథ్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మఫ్తీ  అభిప్రాయంతో కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలను పెంచే ప్రతిపాదనను బిల్లు రూపంలో తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement