
‘ట్రాన్స్ జెండర్’ బిల్లుపై సూచనలు ఇవ్వండి
ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల రక్షణకు సంబంధించిన చట్ట రూపకల్పనపై పార్లమెంటరీ కమిటి ప్రజల నుంచి సూచనలు కోరింది.
న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల రక్షణకు సంబంధించిన చట్ట రూపకల్పనపై పార్లమెంటరీ కమిటి ప్రజల నుంచి సూచనలు కోరింది. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, హక్కుల పరిరక్షణపై బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటి ఈ మేరకు చట్టంపై ప్రజలు, ఎన్‌జీవోల నుంచి సూచనలు కోరినట్లు లోక్‌సభ కార్యాలయం తెలిపింది.
ట్రాన్స్‌జెండర్లు సాంఘిక బహిష్కరణ, వివక్షకు గురవుతుండటం, విద్య, వైద్య, నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటుండటంతో వారి హక్కుల పరిరక్షణకు కేంద్రం బిల్లు రూపకల్పన చేసింది. వీరిపై వివక్ష చూపినా, హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించే దిశగా కేంద్రం చట్టం తయారు చేసింది.