జాట్ వర్గీయుల ఆందోళన చల్లారినట్టే చల్లారి.. మళ్లీ రాజుకుంటోంది. వీరి ఆందోళనలతో అట్టుడికిన రోహతక్‌లో పర్యటించిన హరియాణా ముఖ్యమంత్రి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించిన సీఎంను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీఎం ముర్దాబాద్, గో బ్యాక్ అంటూ ఆయన కారును అడ్డుకున్నారు. అంతకుముందు సీఎం బస చేసిన కెనాల్ అతిథిగృహం దగ్గర ధర్నా చేసి ముర్దాబాద్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరి ఆందోళనల మద్యే సీఎం తన పర్యటనను కొనసాగించారు. ఈ ఉద్యమం వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కి చేరిందని ప్రకటించారు.
కాగా మంగళవారం తిరిగి రోడ్లమీదకు వచ్చిన ఆందోళనకారులు స్థానిక బస్సుడిపో దగ్గర తమ పోరాటాన్నికొనసాగించారు. బస్సులకు నిప్పు పెట్టారు. దీంతోపాటు టొయాటో కార్ల కంపెనీపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు.
విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కోసం హరియాణాలో జాట్‌లు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. జాట్‌లకు రిజర్వేషన్ కల్పించే బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెడతామని బీజేపీ పెద్దలు హామీ ఇవ్వడంతో విధ్వంస కార్యక్రమాలు సోమవారం నాటికి కొంత తగ్గినా, పూర్తిగా చల్లారలేదు. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తే తప్ప ఉద్యమాన్ని విరిమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
సీఎం ముర్దాబాద్ నినాదాల హోరు
Published Tue, Feb 23 2016 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement
Advertisement