gherao
-
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. -
సీఎం ముర్దాబాద్ నినాదాల హోరు
జాట్ వర్గీయుల ఆందోళన చల్లారినట్టే చల్లారి.. మళ్లీ రాజుకుంటోంది. వీరి ఆందోళనలతో అట్టుడికిన రోహతక్‌లో పర్యటించిన హరియాణా ముఖ్యమంత్రి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించిన సీఎంను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీఎం ముర్దాబాద్, గో బ్యాక్ అంటూ ఆయన కారును అడ్డుకున్నారు. అంతకుముందు సీఎం బస చేసిన కెనాల్ అతిథిగృహం దగ్గర ధర్నా చేసి ముర్దాబాద్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరి ఆందోళనల మద్యే సీఎం తన పర్యటనను కొనసాగించారు. ఈ ఉద్యమం వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కి చేరిందని ప్రకటించారు. కాగా మంగళవారం తిరిగి రోడ్లమీదకు వచ్చిన ఆందోళనకారులు స్థానిక బస్సుడిపో దగ్గర తమ పోరాటాన్నికొనసాగించారు. బస్సులకు నిప్పు పెట్టారు. దీంతోపాటు టొయాటో కార్ల కంపెనీపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కోసం హరియాణాలో జాట్లు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. జాట్లకు రిజర్వేషన్ కల్పించే బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెడతామని బీజేపీ పెద్దలు హామీ ఇవ్వడంతో విధ్వంస కార్యక్రమాలు సోమవారం నాటికి కొంత తగ్గినా, పూర్తిగా చల్లారలేదు. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తే తప్ప ఉద్యమాన్ని విరిమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున కేంద్ర మంత్రి పల్లంరాజును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సామర్లకోటలో సమైక్యవాదులు ఆయనను అర్ధగంటసేపు ఘోరావ్ చేశారు. రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమైక్యవాదులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ తన చేతిలో ఏమీలేదని అంతా కేంద్ర చేతిలో ఉన్నట్లు తెలిపారు. అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో మంత్రి శత్రుచర్ల విజయమరామరాజును సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.