న్యూఢిల్లీ: సీబీఐని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధి నుంచి మినహాయిస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం 2011లో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది అజయ్ అగర్వాల్ తొలుత అదే ఏడాది ఢిల్లీ హైకోర్టులో వేశారు. అయితే ఇలాంటి విన్నపాలు వేర్వేరు హైకోర్టుల్లో చాలా దాఖలవడంతో దీన్ని తాజాగా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు.
తన పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని అజయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించిన సంగతిని ఆయన ఆనాడే లెవనెత్తగా... ఢిల్లీ హైకోర్టు 2011 జూలైలో కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీచేసింది. సీబీఐకి ఆర్టీఐ నుంచి పూర్తిగా మినహాయింపు దక్కలేదని, ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అప్పుడే కేంద్రం కోర్టుకు బదులిచ్చింది. తన తాజా పిటిషన్‌లో అజయ్ అప్పటి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment