అమృత్ సంస్కరణల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
సంస్కరణల అమలులో తొలిస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అమృత్ సంస్కరణల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ బుధవారం ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ పట్టణాలకు సంబంధించి సంస్కరణల అమలులో తెలంగాణ ముందంజలో ఉందని ప్రధాని ప్రశంసించారు.