వరద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా | PM announces Rs 2 lakh ex-gratia | Sakshi
Sakshi News home page

వరద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా

Published Sat, Dec 5 2015 8:16 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

వరద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా - Sakshi

వరద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల్లో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

రెండు రోజుల క్రితం తమిళనాడు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.. తక్షణ సాయంగా ఆ రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పలు రాష్ట్రాలు, సినీ ప్రముఖులు తమిళనాడుకు సాయం ప్రకటించారు. వరద తీవ్రత నుంచి కాస్త కుదుటపడుతున్న తమిళనాడులో సహాయక చర్యలను వేగవంతం చేశారు. కాగా వర్షాలు తగ్గుముఖం పట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement