
సాక్షి, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక లాఫింగ్ క్లబ్‌లా మారిందని మోదీ ఎగతాళి చేశారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి త్వరలోనే కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు దూరంజరుగుతున్నా.. ఆ పార్టీ మాత్రం ఏమిపట్టనట్లు వ్యహరిస్తోందని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్ర బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలోని అన్నిప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని ఆయన చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడాలని చెప్పారు. అంతేకాక వాళ్లను మనమంతా మెచ్చుకోవాలని చెప్పారు. దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది.. అయితే అన్నిచోట్లా ఓడిపోయి మనకు గెలుపుని ఇస్తుంది అని చెప్పారు. హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అవినీతి, అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్నారు.. ఆయన కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. వీళ్లను మనము ఏమనుకోవాలి? అని అన్నారు.
అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు మార్పుకు ఓటేశారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక లాఫింగ్ క్లబ్‌గా మారిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల జాబితాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌కు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment