ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షిస్తున్న మోదీ
తిరువనంతపురం : వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తక్షణ సాయంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్లు ప్రకటించారు. వరదల బీభత్సంతో రాష్ట్రంలో సుమారు రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణమే రెండు వేల కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు శనివారం కేరళ వచ్చిన మోదీ, సీఎం పినరయి విజయన్‌తో సమావేశం అయ్యారు.
అనంతరం ఈ నెల 12న కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన రూ.100కోట్లు అదనంగా మరో రూ.500 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు. వరదల్లో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల నష్టపరిహారం ప్రకటించారు. (చదవండి: కేరళ విలవిల)
#WATCH: Prime Minister Narendra Modi conducts an aerial survey of flood affected areas. PM has announced an ex-gratia of Rs. 2 lakh per person to the next kin of the deceased and Rs.50,000 to those seriously injured, from PM’s National Relief Funds (PMNRF). #KeralaFloods pic.twitter.com/T6FYNVLmMu
— ANI (@ANI) August 18, 2018
9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరో వైపు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు, కేరళకు అండగా విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment