న్యూఢిల్లీ : భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ దాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకోని హుటాహుటిన భద్రతా వర్గాలతో సమావేశమవ్వడానికి బయలుదేరారు. బుధవారం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సమక్షంలో విగ్యాన్ భవన్‌లో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. యువకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే మోదీకి.. భారత గగనతలంలోకి ప్రవేశించి పాక్ వైమానిక దళం జరిపిన దాడుల గురించి ప్రధాని కార్యలయ అధికారులు ఓ పేపర్ మీద రాసి అందించారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ప్రధాని భద్రతా బలగాలతో అత్యున్నత స్థాయి సమావేశానికి హుటాహుటిన బయలు దేరారు.
Comments
Please login to add a commentAdd a comment