సాక్షి, పాట్నా : జాతిపిత మహాత్మా గాంధీ వందేళ్ల కిందట చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిహార్‌లోని మోతిహారిలో మంగళవారం 20,000 మంది స్వచ్ఛాగ్రాహి (పరిశుభ్రత రాయబారులు)లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బిహార్‌లో తన సత్యాగ్రహంతోనే గాంధీజీ మహాత్ముడిగా, బాపూగా మారారని కొనియాడారు.
సత్యాగ్రహ స్ఫూర్తితో పరిశుద్ధ భారత్‌కోసం స్వచ్ఛాగ్రాహిలు కృషిచేస్తున్నారన్నారు. ఇది నూతన ఆరంభానికి నాందిగా పరిగణించాలని పిలుపు ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ్ సైతం తన ఉద్యమానికి మహాత్మా గాంధీ నుంచే స్ఫూర్తి పొందారన్నారు. బిహార్‌లో సీఎం నితీష్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు స్వల్ప కాలంలోనే మెరుగైన అభివృద్ధిని సాధిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment