సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఈ దాడి నేపథ్యంలో జాతీయ భద్రత పరిస్థితిని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సిసిఎస్)కి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖల మంత్రులు ఈ సమాశానికి విచ్చేశారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. ముఖ్యంగా ప్రధాని మధ్యప్రదేశ్‌లోని ఇత్రాసి, ధారలలో ఇవాళ, రేపు తలపెట్టిన ర్యాలీలను రద్దు చేసుకున్నారు. జాతీయ భద్రతపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
హోం శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖమంత్రి నిర్మాలా సీతారామన్, ఆర్మీ చీఫ్ రావత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సహాయం అందించేందుకు 12 మంది సభ్యుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం పుల్వామాకు తరలి వెళ్లింది. కాగా గురువారం జమ్మూ కాశ్మీర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పీఎఫ్)పై జరిగిన విధ్వంసకర దాడిలో దాదాపు 40 సైనికులు మంది మృతిచెందగా, మరో 18మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment