Cabinet Committee meet
-
సాగుకు భారీ ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు ఆహార భద్రతను మరింత పెంచే లక్ష్యంతో రూ.14 వేల కోట్లతో ఏడు నూతన సాగు పథకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే వీటి లక్ష్యమని కేంద్ర ఐటీ, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తాజా పథకాలు సాగులో మరిన్ని పరిశోధనలతో పాటు సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో డిజిటైజేషన్ తదితరాలకు మరింత దోహదపడతాయని తెలిపారు. ఆ ఏడు పథకాలివే... 1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (రూ.2,817 కోట్లు). 2. ఆహార, పౌష్టిక భద్రత (రూ.3,979 కోట్లు). 3. వ్యవసాయ విద్య, నిర్వహణ (రూ.2,291 కోట్లు). 4. ఉద్యాన ప్రణాళిక (రూ.860 కోట్లు). 5. పశు ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత (రూ.1,702 కోట్లు). 6. కృషీ విజ్ఞాన కేంద్రాల బలోపేతం (రూ.1,202 కోట్లు). 7. సహజ వనరుల నిర్వహణ (రూ.1,115 కోట్లు). ప్రతి రైతుకూ డిజిటల్ ఐడీ! వ్యవసాయ రంగంలో డిజిటల్ ఇన్నొవేషన్లకు మరింత మద్దతిచ్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు రూ.2,817 కోట్లను కేటాయించారు. దీనికి మొత్తమ్మీద రూ.20,817 కోట్లు కేటాయించాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల (డీపీఐ) మెరుగుదల, డిజిటల్ విధానంలో సాధారణ సాగు అంచనాల సర్వే (డీజీసీఈఎస్) అమలుతో వంటి ఐటీ ఆధారిత చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయి. దీని కింద అగ్రిస్టాక్, కృషీ డెసిషన్ సపోర్ట్ సిస్టం, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ పేరిట మూడు డీపీఐలను రూపొందించనున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్నిరకాల సమాచారాన్నీ విశ్వసనీయమైన రీతిలో నిరంతరం రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవమే దీని లక్ష్యం’’ అని కేంద్రం వెల్లడించింది. ‘అగ్రిస్టాక్‌లో భాగంగా ప్రతి రైతుకూ ఆధార్ మాదిరిగా ఒక డిజిటల్ ఐడీ కేటాయిస్తారు. దీన్ని రైతు గుర్తింపు (కిసాన్ కీ పెహచాన్)గా పేర్కొంటారు. అందులోకి లాగిన్ అయిన మీదట సాగుకు సంబంధించిన సమస్త సమాచారమూ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర భూ రికార్డులు, పంట సాగుతో పాటు పథకాలు, భూములు, కుటుంబం తదితర వివరాలన్నింటినీ చూడవచ్చు. ప్రతి సీజన్లోనూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను మొబైల్ ఆధారిత భూసర్వేల ద్వారా ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. అంటే ఇది డిజిటల్ పంట సర్వే లాంటిది’’ అని వివరించింది. దీనికోసం ఇప్పటిదాకా కేంద్ర వ్యవసాయ శాఖతో 19 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రూ.26 వేల కోట్లతో వాయుసేనకు 240 ఏరో ఇంజన్లు వైమానిక దళానికి సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాల కోసం రూ.26 వేల కోట్లతో హెచ్ఏఎల్ నుంచి 240 ఏరో ఇంజన్లు సమకూర్చుకునేందుకు కూడా భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మొదలై ఎనిమిదేళ్లలో హెచ్ఏఎల్ వీటిని పూర్తిస్థాయిలో అందజేస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు: → గుజరాత్‌లోని సనంద్‌లో రోజుకు 63 లక్షల చిప్స్ తయారీ సామర్థ్యంతో కూడిన సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కైన్స్ సెమీకాన్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. దీని అంచనా వ్యయం రూ.3,307 కోట్లు.→ 309 కిలోమీటర్ల ముంబై–ఇండోర్ నూతన రైల్వే లైన్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. → స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ లక్ష్యసాధనకు 14 సభ్య దేశాలతో కూడిన ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) భేటీలో చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. -
‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం ..ఇంకా ఇతర అప్డేట్స్
-
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఇథనాల్ ధర పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరల్ని కేంద్రం పెంచింది. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 12 శాతం ఇథనాల్ కలిపేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాకు తెలిపారు. ‘‘మూడు రకాల ఇథనాల్ ధరల్ని పెంచాం. చెరుకు రసం నుంచి తీసే ఇథనాల్ లీటర్‌కు రూ.63.45 నుంచి రూ.65.61కి సి–హెవీ మోలాసెస్ నుంచి తీసే ఇథనాల్ రూ.46.66 నుంచి రూ.49.41కు, బి–హెవీ రూట్ నుంచి వచ్చే ఇథనాల్ లీటర్ రూ.59.08 నుంచి రూ.60.73కు పెరుగుతాయి’’ అన్నారు. ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌కు ఫాస్మాఫాటిక్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నైట్రోజన్‌పై కేజీకి రూ.98.02, ఫాస్ఫరస్పై కేజీకి రూ.66.93, పొటాష్పై కేజీకి రూ.23.65, సల్ఫర్పై కేజీకి రూ.6.12 సబ్సిడీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌తో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు అవగాహనా ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెరిగిపోతున్న ధరల కారణంగా డేర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ అలవెన్స్ పెరిగింది. కేబినెట్ తాజా నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వీరితో పాటు సివిలియన్ ఎంప్లాయిస్, డిఫెన్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం డీఏ అలవెన్స్ వర్తించనుంది. ఇక కేంద్రం పెంచిన డీఏ అలవెన్స్ ఈ ఏడాది జులై 1 నుంచి లబ్ధి దారులు పొందవచ్చు. జులై 1 నుంచి ఉద్యోగులు తీసుకున్న శాలరీస్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు (arrears) సైతం చెల్లిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గ కీలక నిర్ణయాలు ►గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు ►డిసెంబర్ 2023 వరకు పథకం పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం ►కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు 4 శాతం డీ ఎ పెంపు ►ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 10వేల కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం -
ఐబీ చీఫ్‌గా అర్వింద్.. ‘రా’ చీఫ్‌గా గోయల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో నిఘా సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నూతన అధిపతిగా ఐపీఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను నియమించింది. అలాగే విదేశా ల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సామనత్ కుమార్ గోయల్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అర్వింద్ కుమార్, గోయల్‌లు రాబోయే రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐబీ ప్రస్తుత చీఫ్ రాజీవ్ జైన్ పదవీకాలం జూన్ 30తో, ‘రా’ చీఫ్ అని ల్ కె.ధస్మనా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిద్దరి పదవీకాలం 2018, డిసెంబర్లోనే ముగిసినప్పటికీ సర్వీసును 6 నెలలు పొడిగించారు. కశ్మీర్ నిపుణుడు అర్వింద్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెండో అత్యంత సీనియర్ అధికారి అయిన అర్వింద్ కుమార్(59) 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి. 1991, ఆగస్టులో ఐబీలో చేరిన కుమార్, ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని భారత ఎంబసీలో ఆయన పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో వ్యవహారాలు, మావోయిస్టుల విషయంలో నిపుణుడిగా పేరు గడించారు. ఆయన అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్’ను బహూకరించింది. ‘బాలాకోట్’ సూత్రధారి గోయల్.. 1984 బ్యాచ్, పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సామనత్ కుమార్ గోయల్ ప్రస్తుతం ‘రా’లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై చేసిన వైమానిక దాడుల వ్యూహ రచనలో గోయల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే 2016, సెప్టెంబర్ 29న చేపట్టిన సర్జికల్ దాడుల పథకరచనలో ముఖ్యభూమిక పోషించారు. నిఘా విషయంలో విశేషానుభవం ఉన్న గోయల్ తన కెరీర్లో ఎక్కువగా పంజాబ్‌లోనే పనిచేశారు. 1990ల్లో పంజాబ్‌లో తీవ్రవాదాన్ని నియంత్రించడంతో గోయల్ కీలకంగా వ్యవహరించారు. 2001లో ఆయన ‘రా’లో చేరారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పోలీస్ మెడల్(గ్యాలెంట్రీ), పోలీస్ మెడల్(మెరిటోరియస్)లను ప్రకటించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పిం చిన అఫిడవిట్లో గోయల్ పేరు కనిపించింది. -
కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఈ దాడి నేపథ్యంలో జాతీయ భద్రత పరిస్థితిని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సిసిఎస్)కి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖల మంత్రులు ఈ సమాశానికి విచ్చేశారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. ముఖ్యంగా ప్రధాని మధ్యప్రదేశ్‌లోని ఇత్రాసి, ధారలలో ఇవాళ, రేపు తలపెట్టిన ర్యాలీలను రద్దు చేసుకున్నారు. జాతీయ భద్రతపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. హోం శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖమంత్రి నిర్మాలా సీతారామన్, ఆర్మీ చీఫ్ రావత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సహాయం అందించేందుకు 12 మంది సభ్యుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందం పుల్వామాకు తరలి వెళ్లింది. కాగా గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్)పై జరిగిన విధ్వంసకర దాడిలో దాదాపు 40 సైనికులు మంది మృతిచెందగా, మరో 18మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
ఆర్థికమంత్రిగా తిరిగి విధుల్లోకి అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అమెరికా వెళ్లిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తిరిగి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. అరుణ్ జైట్లీ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం కశ్మీర్‌లోని పుల్వామాలో 44మంది సీఆర్ఫీఎఫ్ జవానులు అసువులు బాసిన ఉగ్రదాడిపై చర్చించడానికి జరగనున్న కేబినెట్ కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారని తెలిపారు. కాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ చికిత్స నిమిత్తం జనవరి 13న న్యూయార్క్ వెళ్లారు. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం గతవారమే జైట్లీ ఇండియాకు చేరుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుల్వామా ఘటనపై సమీక్షించేందుకు రక్షణ,హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలుతోపాటు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను కూడా ప్రధాని రద్దు చేసుకున్నారు. -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
వరికి కనీస మద్దతు ధర పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్-సెప్టెంబర్) మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్ స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ బాడీ అధికారులు సమావేశమయ్యారు. -
సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలపై మాట్లాడొద్దు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లోని టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ల(దాడికి దిగబోయేముందు ఉగ్రవాదులు తలదాచుకునే చోటు)పై సెప్టెంబర్ 28,29 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోల విడుదలపై పలువురు కేంద్ర మంత్రులు ఇష్టారీతిగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ భేటీలో ప్రధాని.. వీడియోల విడుదలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మంత్రులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీకి చెందిన సీఎంలు, ఇతర నేతలు కొందరు 'మోదీ ఛాతి కొలతల'పై మాట్లాడటాన్ని కూడా పీఎం ఆక్షేపించినట్లు సమాచారం. సర్జికల్ దాడుల వీడియోలు విడుదల చేయాలంటూ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వీడియోలను విడుదల చేయాలా? వద్దా? అనేదానిపైనా కేబినెట్ కమిటీ చర్చించింది. దాడుల వీడియోలను ఆర్మీ అధికారులు బుధవారమే కేంద్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. పలు మల్లగుల్లాల అనంతరం ప్రధాని మోదీ.. వీడియోలు నూటికి నూరు శాతం ఆర్మీకి సంబంధించిన విషయాలని, వాటిని విడుదల చేయాలా, వద్దా అనేది కూడా ఆర్మీ అధికారులే నిర్ణయిస్తాని అన్నట్లు తెలిసింది. భేటీకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు రక్షణ, విదేశీ వ్యవహరాల శాఖల మంత్రులైన మనోహర్ పారీకర్, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం(అక్టోబర్ 2న) స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి రాజ్ నాథ్ మీడియాతో 'వీడియోలు విడుదల చేస్తాం'అని ప్రకటిచిన సంగంతి విదితమే.