ఇక వేలిముద్రే మీ గుర్తింపు! | PM Modi launched bhim app says your thumb impression will be your bank | Sakshi
Sakshi News home page

ఇక వేలిముద్రే మీ గుర్తింపు!

Published Sat, Dec 31 2016 3:23 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

ఇక వేలిముద్రే మీ గుర్తింపు! - Sakshi

ఇక వేలిముద్రే మీ గుర్తింపు!

రెండువారాల్లో ఆధార్‌తో బయోమెట్రిక్‌ చెల్లింపులు
డిజిధన్‌ మేళాలో ఈ–వ్యాలెట్‌ యాప్‌.. ‘భీమ్‌’ ఆవిష్కరణ
దీంతో ఇంటర్నెట్‌ లేకుండానే సాధారణ ఫోన్లతోనూ లావాదేవీలు
నిరాశావాదులకు తన వద్ద ఔషధం లేదన్న ప్రధాని
 

స్మార్ట్‌ ఫోన్‌ అయినా.. వెయ్యి, రూ.1,200 విలువైన ఫీచర్‌ ఫోన్‌ అయినా భీమ్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్‌ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్షరాస్యులను అంగూఠా ఛాప్‌ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు. – ప్రధాని మోదీ

ఇకపై వేలిముద్రే అందరికీ గుర్తింపుగా మారబోతోంది. దాంతోనే అన్ని లావాదేవీలు జరగనున్నాయి. మరో 2 వారాల్లో ప్రారంభమయ్యే ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ చెల్లింపుల విధానం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ స్థానంలో ఈవీఎంలను సమర్థవంతంగా ఉపయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన దేశ సామాన్యులు.. ఈ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్‌ లావాదేవీలు జరిపి, మరోసారి ఆ ఘనత సాధించగలరు’ అంటూ భవిష్యత్‌ భారత డిజిటల్‌ ముఖచిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లకు గట్టారు. దేశ రాజధానిలో జరిగిన డిజిధన్‌ మేళాలో శుక్రవారం అంబేడ్కర్‌ పేరుతో ఆధార్‌ ఆధారిత మొబైల్‌ ఈ వ్యాలెట్‌ యాప్‌ ‘భీమ్‌’(భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ)ను ఆయన ఆవిష్కరించారు.


సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజ లను డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలవైపు ప్రోత్సహించే దిశగా ఆధార్‌ కార్డుతో బయోమె ట్రిక్‌ చెల్లింపుల విధానాన్ని కేంద్రం 2 వారాల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఢిల్లీలోని తలక్‌తోరా ఆడిటోరియంలో ఏర్పా టుచేసిన డిజిధన్‌ మేళాలో ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి కార్డులు, ఈ–వాలెట్‌ల ద్వారా లావాదేవీలు జరిగేలా డిజిటల్‌ కరెన్సీని వినియోగించాలని దేశ ప్రజలను ఆయన కోరారు. డిజిటల్‌ చెల్లింపులు, లావాదేవీలు సులభతరం చేయ డానికి అనువుగా శుక్రవారం ‘భీమ్‌’(భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ) యాప్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

భారత రాజ్యాంగ కర్త, ఆర్థికవేత్త డాక్టర్‌ భీమ్‌ రావు అంబేడ్కర్‌ పేరిట ఆవిష్కరించిన ఈ యాప్‌ ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరో 2 వారాల్లో వేలిముద్రలతో చెల్లింపు విధానాన్ని తీసుకొస్తా మన్నారు. ఫోన్, ఇంటర్నెట్‌ లేకుండా భద్రత మైన లావాదేవీ జరిగే అవకాశాన్ని కల్పించా లని చాలా రోజులుగా ఆలోచిస్తున్నామని మోదీ తెలిపారు. ‘స్మార్ట్‌ ఫోన్‌ అయినా.. వెయ్యి, రూ.1200 విలువైన ఫీచర్‌ ఫోన్‌ అయినా భీమ్‌ యాప్‌ను వినియోగించు కోవచ్చు. దీనికి ఇంటర్నెట్‌ అవసరం లేదు. వేలిముద్రతోనే పనిచేస్తుంది. ఒకప్పుడు నిరక్ష రాస్యులను అంగూఠా ఛాప్‌ (వేలిముద్రగాళ్లు) అనేవారు. కానీ కాలం మారింది. మీ అంగూ ఠానే మీ బ్యాంకు అకౌంట్, మీ గుర్తింపు’అని మోదీ అన్నారు. భీమ్‌ యాప్‌ను వినియోగిం చడం చాలా సులభమన్నారు. ఇప్పటికే 100 కోట్ల మంది దగ్గర ఆధార్‌ కార్డ్‌లు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇంతమంది ఆధార్‌ ఆధారిత యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపితే అది చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్‌లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో ఈవీఎంలను సమర్థవంతంగా వినియోగించి నందుకు ప్రపంచం ఆశ్చర్యపోయిందని.. ఇప్పుడు ఈ కొత్త సాంకేతికను వినియోగించు కోవటమూ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుందన్నారు. ఇక యూపీఐ (యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌), యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా) సేవలకు మరింత భద్రత, అధునాతన ఫీచర్లు జోడించి భీమ్‌ యాప్‌ను రూపొందించారు.

కుంభకోణాల పరిస్థితిలో మార్పు
అవినీతి, నల్లధనంపై చేపట్టిన చర్యలపై ఇప్పటికీ కొందరు నిరాశావాదంతో విమర్శలు చేస్తున్నారని..అలాంటివారికి తన వద్ద ఔషధ మేమీ లేదన్న మోదీ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, విపక్షాలకు చురక లంటించారు. ఆశావాదుల కోసం తనవ ద్ద చాలా అవకాశాలున్నాయని ..సాంకేతిక పరి జ్ఞానం వల్ల పేదలకు, చిరు వ్యాపారులకు, సామాన్యులకు సాధికారత లభిస్తుందన్నారు. ‘మూడేళ్ల క్రితం వరకు పేపర్‌ తెరిస్తే బొగ్గు, 2జీ, తదితర స్కామ్‌ల గురించే కనబడేది. యూపీఏ హయాంలో ఏ కుంభకోణంలో ఎంత డబ్బు పోయిందో రాసేవారు. కానీ ఇప్పుడు వ్యవస్థలోకి ఎంత మొత్తం వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి’అని మోదీ చెప్పారు. నోట్లరద్దు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్న  విమర్శలపైనా మోదీ స్పందించారు. పేదల సొమ్మును కొట్టేస్తున్న ఎలుకను పట్టడమే  కీలకమన్నారు.

లక్కీడ్రాలతో క్రిస్మస్‌ కానుక
అదృష్ట వినియోగదారుల యోజన, డిజిధన్‌ వ్యాపార యోజనలు దేశానికి క్రిస్మస్‌ బహుమ తి అని మోదీ చెప్పారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి దేశంలోని 100 నగరాలలో డిజిధన్‌ మేళాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి మోదీ ప్రశంసాపత్రాలను అందజే శారు. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించే వారికి వంద రోజుల పాటు ఈ యోజనల్లో లక్కీ డ్రాల ద్వారా ఒక్కోవిజేతకు రూ.వెయ్యి అందజేయనున్నారు. ఏప్రిల్‌ 14 (అంబేడ్కర్‌ జయంతి)న  మెగా డ్రా నిర్వహించనున్నారు.

అంబేడ్కర్‌ కలల సాకారం దిశగా..
పేదల అభ్యున్నతికి పాటుపడాలనేది అంబే డ్కర్‌ ఆలోచనని.. అందుకే ఈ యాప్‌కు ఆయ న పేరు పెట్టినట్లు ప్రధాని తెలిపారు. ఆర్థికవేత్త కూడా అయిన అంబేడ్కర్‌ను భారత్‌ మరోసారి గుర్తుచేసుకునే అవకాశం ‘భీమ్‌’యాప్‌ ద్వారా కలిగిందన్నారు. భారత్‌ను ఒకప్పుడు బంగారు పక్షి (సోనేకీ చిడియా)గా ప్రపంచం పిలిచేదని గుర్తుచేసుకున్న మోదీ.. మళ్లీ ఆ పూర్వవైభవం పొందే శక్తి భారత్‌కు ఉందన్నారు. డిజిటల్‌ అనుసంధానం దేశంలో అద్భుతాలు చేస్తుందని.. నగదు ఆధారిత లావాదేవీలన్నీ డిజిటల్‌గా మారేందుకు ఎక్కువరోజులు పట్టదన్నారు. డిజిటల్‌ ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి పౌరుడూ రోజుకు కనీసం ఐదుసార్లు మొబైల్‌ ద్వారా లావాదేవీ లు జరపాలని ప్రధాని కోరారు.

‘భీమ్‌’ను ఇలా వాడాలి
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే ఈ భీమ్‌ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఫోన్‌లలోనూ అందుబాటులోకి తేనున్నారు. మరో 20 రోజుల్లో దీనికి మరిన్ని మార్పులు తీసుకొచ్చి, భద్రతా ప్రమాణాలు చేర్చి సాధారణ ఫోన్లలోనూ పనిచేసేలా సిద్ధం చేయనున్నారు. అప్పుడు ఫోన్‌ కూడా అవసరం లేకుండా కేవలం వేలిముద్రతోనే లావాదేవీలు జరుపుకోవచ్చు. దీనికోసం వ్యాపారులు, దుకాణదారులు బయోమెట్రిక్‌ రీడర్‌ (ధర రూ.2వేల వరకు)ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీన్ని వారి స్మార్ట్‌ఫోన్లకు జతచేయటం ద్వారా వేలిముద్రతో వినియోగదారుడి అకౌంట్‌నుంచి డబ్బులు దుకాణదారుడి అకౌంట్‌లోకి వస్తాయి. అయితే, ఇందుకు వినియోగదారుడి బ్యాంకు ఖాతాతో అతడి ఆధార్‌ నంబర్‌ కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. ఈ భీమ్‌ యాప్‌ ద్వారా వీసా, మాస్టర్, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లు వసూలు చేసే సర్వీస్‌ చార్జీలనుంచి ఉపశమనం కలుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement