విజయ్ మాల్యా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైళ్ల పరిస్ధితులు దయనీయంగా ఉంటాయని బ్రిటన్ కోర్టులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వాదనను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. విజయ్ మాల్యా అప్పగింత కేసుకు సంబంధించి బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ వంటి మా నేతలను బ్రిటిష్ వారు ఈ జైళ్లలోనే ఉంచారని థెరిసా మేతో మోదీ చెప్పారన్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో లండన్‌లో ఇరువురు నేతల భేటీ సందర్భంగా మోదీ ఈ మేరకు స్పష్టం చేశారన్నారు. భారత్‌లో జైళ్ల దుస్థితిపై బ్రిటన్ కోర్టులో మాల్యా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
రుణాల ఎగవేత కేసులో ఎస్‌బీఐ కన్సార్షియం దాఖలు చేసిన కేసులో బ్యాంకులు విజయం సాధించాయని, రుణ రికవరీ చేపట్టవచ్చని చెప్పారు. రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment