మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన మోడీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను భారత ప్రధాని నరేంద్రమోడీ కలుసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ లోని మన్మోహన్ నివాసానికి మోడీ వెళ్లారు మన్మోహన్ సింగ్ ను మోడీ మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్టు సమాచారం.
పుష్ఫగుచ్చం అందించి మోడీని మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ సాదరంగా ఆహ్వానించారు. మోడీ తమ నివాసానికి రావడంపై మన్మోహన్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.