న్యూఢిల్లీ: దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టనుంది. మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు వంట గ్యాస్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించనున్నారు.
5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కలెక్షన్లను రానున్న మూడేళ్లలో పేద కుటుంబాలకు కల్పించన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పేదరిక రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు 1.5 కోట్ల గ్యాస్ కలెక్షన్లను కల్పించనున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
పేద కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్
Published Fri, Apr 22 2016 4:01 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement