
ఆప్ నేత, భార్యపై బెదిరింపు కేసు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస చిక్కులు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆపార్టీకి చెందిన న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ పై నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదవ్వగా.. అదే పార్టీకి చెందిన మరో నేత కుమార్ విశ్వాస్ ఆయన భార్యపై తాజాగా పోలీసులు కేసులు నమోదు చేశారు. నోయిడాలోని ఓ వ్యక్తిని బెదిరించనట్లు ఫిర్యాదు అందడంతోవారిపై కేసులు నమోదయ్యాయి. అయితే, తానుగానీ, తన భార్యగానీ ఎవరినీ బెదరించలేదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.