his wife
-
ఆడపిల్ల పుట్టిందని..!
-
హత్యకేసు నమోదు
చింతలపూడి: చింతపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నామవరం పీఎంపీ వైద్యుడు ధరావతు నాగేశ్వరరావు కేసు కొత్త మలుపు తిరిగింది. భార్య బాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. తన భర్తను కొందరు కక్ష కట్టి కొట్టి చంపారని భార్య బాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చే శారు. జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసు విచారిస్తున్నట్టు ఎస్సై సైదా నాయక్ తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు. రూ.5 లక్షలు పరిహారమివ్వాలి గిరిజన వైద్యుడు నాగేశ్వరరావును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇప్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగేశ్వరరావు నాయక్, ప్రధాన కార్యదర్శి వడిత్య శ్రీనివాసరావు నాయక్ డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించాలి నాగేశ్వరరావు మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధరావతు బాబూరావు నాయక్, గుగ్గులోతు కృష్ణానాయక్, జిల్లా కోశాధికారి బాలూ నాయక్ ìlమాండ్ చేశారు. మృతుని భార్య బాలమ్మకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి నిందితులపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు. -
ఆప్ నేత, భార్యపై బెదిరింపు కేసు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస చిక్కులు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆపార్టీకి చెందిన న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ పై నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదవ్వగా.. అదే పార్టీకి చెందిన మరో నేత కుమార్ విశ్వాస్ ఆయన భార్యపై తాజాగా పోలీసులు కేసులు నమోదు చేశారు. నోయిడాలోని ఓ వ్యక్తిని బెదిరించనట్లు ఫిర్యాదు అందడంతోవారిపై కేసులు నమోదయ్యాయి. అయితే, తానుగానీ, తన భార్యగానీ ఎవరినీ బెదరించలేదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. -
నేను కరెక్ట్... కాదు నేనే !
- పోలీసుస్టేషన్ చేరిన భార్యాభర్తల గొడవ చౌడేపల్లె: మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి తనతో తాళి కట్టించుకుని మోసం చేసిందని భర్త.. తాను అన్ని విషయా లు పెళ్లికి ముందే చెప్పానని, ఇప్పుడు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భార్య ఇద్దరూ సోమవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోమల మండలం కామిరెడ్డిపల్లెకు చెందిన ఉత్తన్న కుమార్తె రేఖాప్రసన్న అలియాస్ శిరీష తిరుపతిలో చదువుకున్నారు. అదే మండలం పేటూరుకు చెందిన వెంకటరమణకుమారుడు నగేష్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో మొబైల్‌కు వచ్చిన మిస్డ్ కాల్ ద్వారా ఇరువురూ స్నేహితులయ్యారు. వారిస్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఇద్దరూ హైదరాబాదులో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. చౌడేపల్లె మండలంలోని లద్దిగం గ్రామానికి చెందిన నగేష్ బంధువులు వీరిని చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ ఉన్న నగేష్ భార్య రేఖా ప్రసన్న అలియాస్ శిరీషాను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు రమేష్ ఇదివరకే శిరీషను వివాహం చేసుకున్నాడన్న విషయాన్ని నగేష్‌కు బంధువులు తెలిపారు. దీంతో అతను గ్రామానికి వెళ్లి విచారించానని, రమేష్‌తో వివాహం జరిగిన విషయం నిజమని తేలిందని నగేష్ ఆరోపిస్తున్నాడు. మొదటి వివాహ విషయం దాచి పెట్టి తనను మోసం చేసిం దని గ్రామపెద్దల సహకారంతో నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని నగేష్ కు చెప్పానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనే దాచి పెట్టాడని, ఇప్పుడు అందిరికీ తెలిసాక తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని రేఖాప్రసన్నఅలియాస్ శిరీష వాపోయారు. భర్త నగేష్ తనకు కావాలని శిరీష పట్టుబడుతున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.