హత్యకేసు నమోదు | murder case file | Sakshi
Sakshi News home page

హత్యకేసు నమోదు

Published Sat, Aug 13 2016 9:09 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

హత్యకేసు నమోదు

హత్యకేసు నమోదు

చింతలపూడి: చింతపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నామవరం పీఎంపీ వైద్యుడు ధరావతు నాగేశ్వరరావు కేసు కొత్త మలుపు తిరిగింది. భార్య బాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఏలూరు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. తన భర్తను కొందరు కక్ష కట్టి కొట్టి చంపారని భార్య బాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చే శారు.  జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసు విచారిస్తున్నట్టు ఎస్సై సైదా నాయక్‌ తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు. 
రూ.5 లక్షలు పరిహారమివ్వాలి
గిరిజన వైద్యుడు నాగేశ్వరరావును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇప్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూక్యా నాగేశ్వరరావు నాయక్, ప్రధాన కార్యదర్శి వడిత్య శ్రీనివాసరావు నాయక్‌ డిమాండ్‌ చేశారు. 
నిందితులను శిక్షించాలి
నాగేశ్వరరావు మృతికి కారణమైన నిందితులను అరెస్ట్‌ చేసి శిక్షించాలని ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధరావతు బాబూరావు నాయక్, గుగ్గులోతు కృష్ణానాయక్, జిల్లా కోశాధికారి బాలూ నాయక్‌ ìlమాండ్‌ చేశారు. మృతుని భార్య బాలమ్మకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి నిందితులపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు. 
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement