
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిపై ప్రతాపాన్ని చూపారు. లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులని కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్‌లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి తలలకు పెద్ద గాయాలు తగిలాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ పలువురు విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా విద్యార్థులపై పోలీసుల దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment