
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం కొంతమేర మెరుగుపడింది. అయినా ఇప్పటికీ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పగటి సమయంలో కాలుష్య తీవ్రత తగ్గి గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ విభాగం సఫర్(సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ప్రకటించింది. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించిన వాయు నాణ్యత సూచీ పీఎమ్10 స్థాయి ప్రకారం గత బుధవారం దేశ రాజధానిలో కాలుష్యం 778 పాయింట్లు కాగా శనివారం 522కు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment