కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా! | Poster by Congress shows Kiran Bedi as Adolf Hitler | Sakshi
Sakshi News home page

కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!

Published Fri, Jul 21 2017 9:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా! - Sakshi

కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!

పుదుచ్చేరి: అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం, ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎల్జీ కిరణ్ బేడీ ఓ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌గా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు అంటించడం మరో వివాదానికి దారితీసింది. తవళకుప్పం జంక్షన్లో కిరణ్ బేడీ.. ఓ హిట్లర్ అని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు బేడీని ఏకంగా జర్మనీ నియంత హిట్లర్‌గా చిత్రీకరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల నియామకమైన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై భగ్గుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై, కిరణ్ బేడీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌  బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, వాపపక్షాలు, వీసీకేలు మూకుమ్మడిగా బేడీ చర్యలను వ్యతిరేకించడంతో పాటు ఆమెను వెనక్కు పంపాలని, డిస్మిస్ చేయాలని నినాదాలు చేస్తున్నారు.

నామినేటెడ్ పోస్టుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 8న ఈ పార్టీలు బంద్ ను చేపట్టి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని ఆందోళనకు దిగారు. మరోవైపు బేడీ మాత్రం ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు తప్పు చేసినా బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో గ్రూపులో అవినీతి వివరాలను వెల్లడిస్తుండటం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. తాను రబ్బర్ స్టాంప్‌ను కానని, అన్యాయాన్ని ప్రశ్నించే అధికారంతో పాటు ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ బేడీ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement