సామాజిక సంబంధాల సైట్ ‘ట్విట్టర్’లో.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అడుగుపెట్టారు. ఇకపై ఆయనకు సంబంధించిన సమాచారం, రాష్ట్రపతిభవన్ వార్తలు కూడా ఆయన ట్విట్టర్ ఖాతా
న్యూఢిల్లీ: సామాజిక సంబంధాల సైట్ ‘ట్విట్టర్’లో.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అడుగుపెట్టారు. ఇకపై ఆయనకు సంబంధించిన సమాచారం, రాష్ట్రపతిభవన్ వార్తలు కూడా ఆయన ట్విట్టర్ ఖాతా ‘ఃఖ్చటజ్టిట్చఞ్చ్టజీఆజిఠి ’లో దర్శనమివ్వనున్నాయి. ఇదే విషయాన్ని మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటిస్తూ ‘రాష్ట్రపతి భవన్ ట్విట్టర్‌లో ప్రవేశించింది.
నిరంతర వార్తల కోసం మమ్మల్ని అనుసరించండి’ అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మనుగడలోకి వచ్చిన ఈ అకౌంటుకు అప్పుడే 9 వేల మందికిపైగా అభిమానులు(ఫాలోవర్లు) ఉన్నారు. 2006లో జూలైలో ట్విట్టర్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రపతి అందులో ఖాతా తెరవడం ఇదే ప్రథమం. ఫేస్‌బుక్‌లో నిరంతరం తన కార్యక్రమాలను అప్డేట్ చేసే తొలి రాష్ట్రపతి కూడా ప్రణబే.