
సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్‌ఫోన్ అంటే పడిచచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆపిల్‌కు అభిమానే. సోషల్‌మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే మోదీ గాడ్జెట్ల పట్ల తనకున్న అభిమానాన్ని చాలా సార్లు బహిరంగంగానే చాటుకున్నారు. 2018లో చైనా, దుబాయ్ దేశాల పర్యటన సమయంలో ఆపిల్ ఐఫోన్ 6 సిరీస్ స్టోర్లను సైతం సందర్శించారు. మోదీ డిజిటల్ ఇండియా చొరవతోనే భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. 2019 సంవత్సరానికి గానూ భారత్ ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. 2014లో కేవలం రెండు మొబైల్ యూనిట్ల తయారీ ప్లాంట్ల నుంచి నేడు 268 తయారీ యూనిట్లకు ఎదిగి స్మార్ట్‌ఫోన్ల తయారీలోదూసుకుపోతోంది.
అందుకే మోదీ కేవలం చేతిలోని ఫోన్‌తో కోట్ల ప్రజలతో నిరంతరం తన భావాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోదీని 110 మిలియన్లు ఫాలో అవుతున్నారు. ఇక ట్విటర్ యుద్ధాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ట్రంప్ సైతం స్మార్ట్‌ఫోన్ ప్రియుడే. ఈయనని ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్ల మంది సోషల్‌మీడియాలో ఫాలో అవుతున్నారు. ఆపిల్‌కు ఒక్క మోదీయే కాదు ఆయన కేబినెట్ మంత్రులు సైతం అభిమానులే. ముఖ్యంగా ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆపిల్ ఎక్స్‌ఎస్‌ను వాడుతున్నారు. ఈయనకు ట్విటర్‌లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఐఫోన్, ఆండ్రాయిడ్‌లు రెండూ వాడుతున్నారు. ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తన స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్‌మీడియాలో ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ఇక నర్మగర్భ వ్యాఖ్యలతో ఎన్నికల ఫలితాల వరకూ హడావుడి చేసిన నితిన్ గడ్కరీకి 5.15 మిలియన్ల ఫాలోవర్లు ట్విటర్‌లో ఉన్నారు. ఇలా ప్రముఖులు అందరూ అరచేతితో ప్రపంచాన్ని పలకరిస్తూ బిజీగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment