సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థను బాలీవుడ్‌తో ముడిపెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. కేంద్ర మంత్రి సినీ జీవితం నుంచి బయటపడాలని, వాస్తవ పరిస్థితి నుంచి ఆయన తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, ప్రజల సొమ్ముతో ఎదిగిన బ్యాంకులు దీనస్థితిలో ఉన్నాయని ఈ స్థితిలో ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించడం విచారకరమని అన్నారు. సినిమాలు సాధించే లాభాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. మంత్రి గారూ సినిమాల నుంచి బయటకు రండి..వాస్తవాన్ని అంగీకరించేందుకు సిగ్గు పడకండ’ని ప్రియాంక ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం లేదని, ఇటీవల విడుదలైన మూడు సినిమాలు తొలిరోజే బాలీవుడ్‌లో రూ 120 కోట్ల వసూళ్లు సాధించడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాదచేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో కేంద్ర మంత్రి ఆదివారం తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment