'క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక రావాలి'
న్యూఢిల్లీ: దారుణమైన ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని కేంద్ర మంత్రి కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయపథంలోకి నడిపించడానికి ప్రియాంక సేవలు అవసరమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం కావాలని థామస్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలివుండే ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో పదవిని అలంకరించాలని థామస్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని నేతలు, ప్రజలు కోరుకుంటున్నారని థామస్ అన్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కుటుంబ వ్యవహారం కాదని థామస్ అన్నారు.