ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది | Prohibition of Child Marriage Act applies to Muslims too: Gujarat High Court | Sakshi
Sakshi News home page

ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది

Published Sat, Sep 26 2015 1:23 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది - Sakshi

ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది

అహ్మదాబాద్:  గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాల్యవివాహ నిరోధక చట్టం అన్ని మతాలవారికీ  వర్తిస్తుందని తేల్చి చెప్పింది. గుజరాత్కు చెందిన యూనుస్ షేక్  అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. బాల్యవివాహ నిరోధక చట్టం  ప్రత్యేక చట్టమని, కనుక ముస్లింలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది.  ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను  సైతం తోసిపుచ్చుతుందని జస్టిస్ జెబి పర్దివాలా స్పష్టం చేశారు. ఆయా పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందన్నారు. దీంతోపాటు మార్పులు, చేర్పులకు  అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని  వ్యాఖ్యానించారు.  
 
గుజరాత్లో యూనుస్ షేర్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు.  అయితే యూనుస్ వాదనలను హైకోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement