
చంఢీఘర్: లాయర్లు తనను సంబోధిస్తున్నప్పుడు 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్' అనే పదాలను ఉపయోగించరాదని పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ కోరారు. ఈ మేరకు ఆయన సూచించినట్టు చంఢీఘర్‌లోని బార్ అసోసియేషన్ ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇటీవలే పంజాబ్ హర్యానా కోర్టుకు బదిలీ అయ్యారు.
న్యాయమూర్తులను 'సర్' అని గానీ, 'యువర్ హానర్' అని గానీ సంబోధించాలని చండీఘర్‌లోని హైకోర్టు బార్ అసోసియేషన్ గతంలో తమ లాయర్లకు సూచించింది. అయితే అనేకమంది న్యాయవాదులు తమ జడ్జీలను యువర్ లార్డ్ షిప్, మై లార్డ్, మిలార్డ్ అంటూ సంబోధిస్తూ వస్తున్నారు. తాజాగా జస్టిస్ మురళీధర్ ఈ సూచన చేయడం విశేషం. ఢిల్లీ అల్లర్ల సమయంలో విచారణ సందర్భంగా పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈ బదిలీ బీజేపీ నేతలను కాపాడేందుకే అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆయన మాత్రం తన బదిలీని హుందాగా స్వీకరించారు. చదవండి: రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ
Comments
Please login to add a commentAdd a comment