ఇంట్లో ఏదైనా పనికిరాని పాత వస్తువు ఉందంటే.. దాన్ని అమ్ముకోడానికి రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ పిల్లాడిని అమ్మకానికి పెట్టేందుకు కూడా ప్రకటన పెట్టిన ఘనత క్వికర్కు దక్కింది. 'రాహుల్ ఫర్ సేల్' అనే శీర్షికతో.. ఆ పిల్లాడిని 5 రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లున్న ప్రకటన తీవ్ర వివాదం రేకెత్తించింది.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది కాస్తా వివాదం కావడంతో క్వికర్ వెంటనే ఆ యాడ్ తీసేసింది. అసలు అలాంటి ప్రకటన ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా తాము ఆరా తీస్తున్నట్లు ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. చెన్నై నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ప్రకటన ఇచ్చినట్లు తెలిసింది.
రూ. 5కే అమ్మకానికి అబ్బాయి!
Published Fri, Jan 23 2015 5:43 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
Advertisement