
హిన్‌డన్‌లో విన్యాసాలు చేస్తున్న సారంగ్ హెలికాప్టర్లు
హిన్‌డన్/చెన్నై: అధునాతన రాఫెల్ యుద్ధవిమానాలు, క్షిపణి విధ్వంసక రష్యా ఎస్–400 వ్యవస్థలను సమకూర్చుకుంటే భారత వాయుసేన(ఐఏఎఫ్) మరింత దుర్భేద్యంగా మారుతుందని ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వ్యాఖ్యానించారు. గగనతలంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు. ఐఏఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవం(ఎయిర్‌ఫోర్స్ డే) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిన్‌డన్ వైమానిక స్థావరంలో నిర్వహించిన కార్యక్రమంలో ధనోవా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment