పనాజీ : తొలుత ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అనంతరం పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీటి నుంచి కాస్తా బ్రేక్ తీసుకున్నారు. తల్లి సోనియా గాంధీతో కలిసి ప్రైవేట్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. మూడు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్.. తల్లి సోనియాతో కలిసి గోవా వెళ్లారు. టూర్‌లో భాగంగా ఆదివారం దక్షిణ గోవాలో సీఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన ‘వార్ఫ్ రెస్టారెంట్’కు వెళ్లారు. అది కూడా భద్రతా సిబ్బంది లేకుండా.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కస్టమర్లతో సీఫుడ్‌తో లంచ్ చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ.. సరదగా గడిపారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రచ్నా ఫెర్నాండేజ్ అనే టూరిస్ట్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం గురించి రచ్నా మాట్లాడుతూ.. ‘ఆదివారం నా బంధువులతో కలిసి నేను వార్ఫ్ రెస్టారెంట్‌కు వెళ్లాను. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ కూడా అదే రెస్టారెంట్‌లో ఉన్నారు. వారి వెంట సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం చూసి మేం చాలా ఆశ్యర్యపోయాం’ అని తెలిపారు.
రచ్నా మాట్లాడుతూ.. ‘మీతో ఓ ఫోటో దిగాలని ఉంది అని రాహుల్ గాంధీని కోరాను. అందుకు ఆయన బిల్ పే చేసి వచ్చాక ఫోటో దిగుతానని చెప్పారు. అన్నట్లుగానే నాతో సెల్ఫీ దిగారు’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాక ‘చెత్త రాజకీయాల్లో చాలా మంచి వ్యక్తి రాహుల్ గాంధీ’ అంటూ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment