రాహుల్‌ సోలో పర్‌ఫార్మెన్స్‌! | Rahul Gandhi to go Solo at Bihar Rally Today As Nitish, Lalu Stay Away | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సోలో పర్‌ఫార్మెన్స్‌!

Published Sat, Sep 19 2015 11:15 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

రాహుల్‌ సోలో పర్‌ఫార్మెన్స్‌! - Sakshi

రాహుల్‌ సోలో పర్‌ఫార్మెన్స్‌!

చంపారన్:  ఆదిలోనే హంసపాదు అంటే ఇదేనేమో... బీహార్‌ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ మొదట్లోనే షాక్ తగిలింది. జేడీయూ-ఆర్జేడీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు రిక్తహస్తం చూపిస్తున్నాయి.  పశ్చిమ చంపారన్‌ జిల్లాలో రాహుల్‌గాంధీ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సభకు మిత్రపక్షాలు ముఖం చాటేస్తున్నాయి.

మొదట ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తాను రాహుల్ సభకు రాలేనంటూ హ్యాండివ్వగా ఇప్పుడు జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంతు వచ్చింది. రాహుల్ సభకు తాను రాలేనని నితీష్ కుమార్ తెలిపారు. దీంతో రాహుల్‌ సోలో పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వనున్నారు. మిత్రుల గైర్హాజరులో సాగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 కాగా ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కూటమితో చేయి కలిపిన హస్తం పార్టీ... కేవలం నలభై స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మూడు పార్టీలూ కలసి మోడీని ఢీకొట్టేందుకు మహా కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.  మరి రాహుల్ ఏమేరకు ఓటర్లను ఆకట్టుకుంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement