
24న అనంతపురంలో రాహుల్ పాదయాత్ర
హైదరాబాద్ : జూలై 24 వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించేందుకు ఇక్కడకు విచ్చేయనున్నారు. ఓబులదేవర చెరువు మండలంలో రైతుల సమస్యలపై సుమారు 15 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు.